: పెళ్లిళ్లకి తాత్కాలిక విరామం


పెళ్లిళ్లకి తాత్కాలిక విరామం లభించనుంది. రెండు ఆషాఢాలు, గోదావరి పుష్కరాలు రానుండడంతో పెళ్లి ముహూర్తాలు లేకుండా పోయాయి. మరో నాలుగు నెలలు ఆగితే కానీ శుభకార్యాలు చేసుకునే వీలు లేకపోవడంతో కేవలం పెళ్లిళ్లకే కాకుండా, శుభకార్యాలకు కూడా వేచిచూడాల్సిందే. జూన్ 11వ తేదీతో శుభముహూర్తాలు ముగిసిపోనున్నాయి. సాధారణంగా ఏటా ఒకటే ఆషాఢ మాసం ఉంటుంది. ఆ సమయంలో పెళ్లి ముహూర్తాలు ఉండవన్నది అందరికీ తెలిసిందే. అయితే, ఈసారి రెండు ఆషాఢాలు(అధిక, నిజ ఆషాఢం) వస్తున్నాయి. దీంతో రెండు నెలల పాటు ముహూర్తాలు ఉండే అవకాశం లేదు. మరోవైపు జులై 14న గురుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇదే రోజు గోదావరి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ సమయంలో అంతా పెద్దల్ని స్మరించుకుంటూ తర్పణం సమర్పిస్తారు. ఇలా పుష్కరాలు ప్రారంభమైన నాలుగైదు మాసాల వరకు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. అదీ కాక, పుష్కరాల తరువాత వచ్చే శ్రావణ మాసంలోనూ పెళ్లి ముహూర్తాలు పెద్దగా లేవు. ఇక గోదావరి నదీ తీరప్రాంత వాసులులైతే 2016 ఆగస్ట్ వరకూ ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని వేడపండితులు పేర్కొంటున్నారు. దీంతో వివాహాలకు తాత్కాలిక విరామం లభించనుంది. తీరానికి దూరంగా ఉండే వారు మాత్రం దసరా తరువాత పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News