: సన్నీలియోన్ ని వెళ్లిపొమ్మంటున్న బాలీవుడ్ శృంగారతార


బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీలియోన్ ని మరో శృంగారనటి రాఖీ సావంత్ కెనడా వెళ్లిపొమ్మంటోంది. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాఖీ సావంత్, తాను మరింత అందంగా, ఆకర్షణీయంగా కనపడాలంటే ఏం చేయాలని అందులో పాల్గొన్న కొంతమంది పెద్దలను అడిగింది. దానికి వారు యోగా చేయాలని చెప్పారు. దీంతో ఓ నటిని బాలీవుడ్ నుంచి పంపించేయాలని ఉందని, దానికి ఏం చేయాలని వారిని సలహా అడిగింది. దాంతో వారు బిత్తరపోయారు. అయితే అక్కడే ఉన్న మీడియా ఇంతకీ ఎవరా నటి? అని ఆరా తీసేసరికి 'సన్నీలియోన్' అని చెప్పింది. ఎందుకు? అనంటే...అసభ్యకర వస్త్రధారణ, పాత్రలతో భారతీయ యువకులను పాడుచేసేస్తోందని, అందుకే సన్నీని కెనడా పంపించేయాలనుకుంటున్నానని రాఖీ సావంత్ సెలవిచ్చింది.

  • Loading...

More Telugu News