: భారీ యుద్ధ విన్యాసం 'బాహుబలి' టీజర్


భారత సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'బాహుబలి' సినిమా టీజర్ విడుదలైంది. 20 సెకన్ల నిడివి గల ఈ టీజర్ ను రాజమౌళి, భల్లాలదేవ (రాణా) విడుదల చేయగా, ట్విట్టర్లో దేవసేన (అనుష్క) రిలీజ్ చేసింది. టీజర్ లో కత్తిపట్టిన రానా, ప్రభాస్ కళ్లు కనిపిస్తాయి. పాత్రలను కూడా రివీల్ చెయ్యకుండా టీజర్ ను రాజమౌళి విడుదల చేయడం విశేషం. భారీ యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ టీజర్ సినిమా స్థాయిని అభిమానులకు కాస్త రుచిచూపింది. 'బాహుబలి' థియేటర్ ట్రైలర్ ను జూన్ 1న విడుదల చేయనున్నారు. 'బాహుబలి' ట్రైలర్ ను కటింగ్ ఎడ్జ్ డాల్బీ ఎట్మాస్ మిక్సింగ్‌ టెక్నాలజీలో రూపొందించినట్టు రాజమౌళి తెలిపారు. ఈ టెక్నాలజీ తెలుగు సినిమాల్లో తొలిసారి ఉపయోగించినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News