: ఢిల్లీలో మాటువేసి, చైనా స్మగ్లర్ ను పట్టుకున్న ఏపీ పోలీసులు
ఏపీ పోలీసులు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ను చాకచక్యంగా పట్టుకున్నారు. ఢిల్లీలో చైనాకు చెందిన చెన్యీపియాన్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ఫరీదాబాద్ లో ఎర్రచందనం దుంగలు కొనుగోలు చేసేందుకు వచ్చిన చెన్యీపియాన్ ను మాటువేసిన ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 2500 యెన్ లు, పాస్ పోర్టు, వీసా, బుద్ధుడి విగ్రహం, ఎర్రచందనంతో చేసిన బొమ్మలను స్వాధీనం చేసుకున్నారు.