: చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా
అగ్రదేశాలు రెండూ ముఖాముఖి తలపడేందుకు సిద్ధపడుతున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. సింగపూర్ వేదికగా చైనాపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగపూర్ లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సులో అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ యాష్ కార్టర్ చైనా వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేశారు. వైమానిక స్థావరాల కోసం చైనా కృత్రిమ దీవులు నిర్మిస్తోందని, అంతర్జాతీయ జలాలపై సార్వభౌమాధికారాన్ని చేజిక్కించుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై అక్కడే ఉన్న చైనా అధికారులు నిరసన వ్యక్తం చేశారు.