: టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే మాధవరం
కేసీఆర్ ఆకర్ష్ మంత్రానికి టీడీపీలో మరో వికెట్ పడింది. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్టారావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. జగదేవ్ పూర్ లోని తన ఫామ్ హౌస్ లో మాధవరంకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేసీఆర్. ఇదే బాటలో మరికొంత మంది ఎమ్మెల్యేలు నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ధర్మారెడ్డిలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాధవరం చేరికతో మొత్తం ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కారెక్కినట్టయింది.