: ఎన్టీఆర్ లో ఉన్న ఒక్క లక్షణమూ చంద్రబాబులో లేదు: గట్టు


టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ లో ఉన్న లక్షణాల్లో ఏ ఒక్కటీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడులో లేదని టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకే మహానాడును హైదరాబాదులో పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రతి రైతుకీ రుణమాఫీ జరిగింది, మరి ఏపీలో అలా జరిగిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఖబడ్దార్ అనేంత దమ్ముందా? అని ఆయన సవాలు విసిరారు. ఏపీలో చంద్రబాబు అరాచకవాదిగా మారాడని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News