: క్షమిస్తా...కానీ జరిగినది మర్చిపోను: సెప్ బ్లాటర్


పీఫాలో గత నెలలో చోటుచోసుకున్న సంఘటనలపై అధ్యక్షుడు సెప్ బ్లాటర్ స్పందించారు. పీఫా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనలో అందర్నీ క్షమిస్తాను కానీ, జరిగిన సంఘటనను మాత్రం మర్చిపోనని అన్నారు. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ (యూఈఎఫ్ఏ) తనపై లేనిపోని ఆరోపణలు చేయడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు తనను లక్ష్యంగా చేసుకుని చేసినవే అయినప్పటికీ, ఈ వ్యాఖ్యలు యావత్ ఫుట్ బాల్ ప్రపంచాన్ని కించపరిచేవిగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఎన్ని ఆరోపణలు వచ్చినా, తాజాగా జరిగిన పీఫా అధ్యక్ష ఎన్నికల్లో సెప్ బ్లాటర్ మరోసారి విజయం సాధించడం విశేషం.

  • Loading...

More Telugu News