: ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన షరీఫ్


ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి టీడీపీ తరపున ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన ఎంఏ షరీఫ్ ఏన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి తన కార్యాలయంలో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పలువురు టీడీపీ నేతలు షరీఫ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి షరీఫ్, ప్రతిభా భారతిలు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.

  • Loading...

More Telugu News