: కేసీఆర్ వ్యాఖ్యలకు విరుద్ధంగా మాట్లాడిన హోం మంత్రి నాయిని


హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో 11 ఎకరాల భూమిని తీసుకుని పేదలకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉస్మానియా విద్యార్థులు భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలో, విద్యార్థులకు ఏమీ తెలియదని మళ్లీ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో వారు మరింత రెచ్చిపోయారు. ఆందోళనకు దిగిన విద్యార్థులు హోటల్, పెట్రోల్ బంక్ లపై కూడా దాడి చేశారు. ఈ క్రమంలో, టీఎస్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్ కు విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా భూములు ఎవడబ్బ సొమ్మూ కాదని... ఎవరూ తీసుకోరని కొట్టి పారేశారు. అయితే, నాయిని కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారా? లేక పొరపాటున నోరు జారారా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం అందరి మదిలో తలెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News