: ఆసుపత్రి నుంచి ధర్మేంద్ర డిశ్చార్జ్


బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తీవ్ర అనారోగ్యం, భుజంనొప్పి కారణంగా ఈ నెల 27న ఆయన దక్షిణ ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా వైద్యులు ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. "పూర్తి వైద్య పరీక్షల కోసమే ధర్మేంద్ర ఆసుపత్రికి వచ్చారు. అవసరమైన పరీక్షలు చేసి, అంతా బాగానే ఉందని తెలుసుకున్నాం. ఆయన చాలా బాగున్నారు... ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన ఈ మధ్యాహ్నం డిశ్చార్జ్ అవుతున్నారు" అని ఆర్థోపెడిక్ సర్జన్ డా.సంజయ్ దేశాయ్ వివరించారు. కొన్నిరోజుల తరువాత ధర్మేంద్ర భుజం నొప్పికి ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉందని, ఇంకా దానిపై ఆయనతో మాట్లాడాల్సి ఉందని డాక్టర్ తెలిపారు.

  • Loading...

More Telugu News