: నిరాహార దీక్ష చేస్తూ అసువులు బాసిన మహిళా కార్మిక నేత
మండుతున్న ఎండలు, వడగాలులు ఓ మహిళా కార్మిక నేతను బలిగొన్నాయి. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ లోని మహోలీలో గత 17 ఏళ్లుగా మూతపడి ఉన్న షుగర్ మిల్లును తెరిపించాలని డిమాండ్ చేస్తూ మహిళా నేత రామ్ రాఠి (40) నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక కార్మిక సంఘం తరపున జరుగుతున్న ఈ దీక్షలో మరో 30 మంది ఆందోళనకారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు మహిళా నేత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ, డీహైడ్రేషన్ మూలంగా ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. వేడిగాలుల తీవ్రతకు ఆమె తట్టుకోలేకపోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆందోళన విరమించమని విజ్ఞప్తి చేసినా... పట్టించుకోని ఆందోళనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.