: హైదరాబాదులో మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లకు ఎంపిక చేసిన ప్రాంతాలు ఇవిగో!
గ్రేటర్ హైదరాబాదు మున్సిపాలిటీ పరిధిలో మల్టీలెవెల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 20 సర్కిళ్లలో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఫ్లై ఓవర్లు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించనున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులు గల మానిటరింగ్ కమిటీని నియమిస్తున్నట్టు ఈ ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 ఆగ్రసేన్ జంక్షన్, కేన్సర్ ఆసుపత్రి, ఫిల్మ్ నగర్, జూబ్లీచెక్ పోస్టు, ఎల్బీనగర్ చౌరస్తా, రసూల్ పురా చౌరస్తా, ఉప్పల్ జంక్షన్, అయ్యప్ప సొసైటీ జంక్షన్, జీపీవో జంక్షన్, బహుదూర్ పుర జంక్షన్, మైండ్ స్పేస్, హైటెక్ సిటీలలో ఈ మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లు నిర్మిస్తారు.