: ఎమ్మెల్సీ ఎన్నికల్లో 'నోటా' ఆప్షన్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 'నోటా' సదుపాయం కూడా ఉన్నట్టు మాజీ ప్రధాన ఎలక్షన్ కమీషనర్ హెచ్.ఎస్ బ్రహ్మ తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారానే ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందని చెప్పారు. సరైన కోటా ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తామని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు, అసెంబ్లీ సిబ్బందికి అధికారులు శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మ మాట్లాడుతూ, ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయాలన్నారు. జూన్ 1 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుందని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని బ్రహ్మ వివరించారు.