: తెలుగు ముఖ్యమంత్రుల మధ్య ఎడమొహం, పెడమొహం: దత్తన్న


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మధ్య సరైన సంబంధాలు లేవని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారని ఆయన అన్నారు. పలు విషయాల్లో వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని గుర్తు చేసిన ఆయన, ఇద్దరు సీఎంలనూ దారిలో పెట్టడమే తన ధ్యేయమని వివరించారు. కేసీఆర్, చంద్రబాబులు కలసి పనిచేసేలా చూసేందుకు తనవంతు కృషి చేస్తానని దత్తన్న తెలిపారు.

  • Loading...

More Telugu News