: పోలవరం కోసం రఘువీరా పాదయాత్ర
పోలవరం అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని ఏపీ కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పోలవరం కోసం తాను పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, కళ్యాణదుర్గం నుంచి అనంతపురం దాకా పాదయాత్ర చేస్తానని తెలిపారు. ఇదే సమయంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు... వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. రైతులను, మహిళలను నిలువునా ముంచేసిన ఘనత చంద్రబాబుదేనని ఆరోపించారు. బాబుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని డిమాండ్ చేశారు.