: నాలుగు రెట్లు పెరిగిన విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా... వేల కోట్ల ఆదాయానికి గండి


మన దేశంలో విదేశీ సిగరెట్ల అమ్మకాలు బాగా పెరిగాయి. హైదరాబాదులాంటి నగరాల్లో అయితే, ఏ పాన్ షాప్ కు వెళ్లినా విదేశీ సిగరెట్లు దర్శనమిస్తాయి. వాటిని వాడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో, విదేశాల నుంచి మన దేశంలోకి సిగరెట్ల అక్రమ రవాణా నాలుగు రెట్లు పెరిగిందట. అక్రమ రవాణా కారణంగా 2014-15 మధ్య కాలంలో ప్రభుత్వానికి రూ. 2,363 కోట్ల నష్టం వాటిల్లింది. యూఏఈ, సింగపూర్, చైనా, మలేషియా, ఇండొనేషియా, కొరియా దేశాలనుంచి విదేశీ సిగరెట్లు అక్రమంగా దిగుమతి అవుతున్నాయి. ఈ వివరాలను 'డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్' వెల్లడించింది.

  • Loading...

More Telugu News