: కేసీఆర్ కాన్వాయ్ లోని కార్లు ఢీకొట్టుకున్నాయి!


ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ లోని కార్లకు ప్రమాదం తప్పింది. కాన్వాయ్ లోని కార్లు ఒకదానినొకటి ఢీకొట్టుకుని చిన్నపాటి టెన్షన్ సృష్టించాయి. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిందుకు సీఎం బయల్దేరి వెళ్లారు. నల్గొండ జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద సీఎం కాన్వాయ్ లోని ఓ వాహనం దాని ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో కాన్వాయ్ లోని మిగతా వాహనాలు కూడా ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. అయితే ఎలాంటి ప్రమాదం కాలేదని తెలిసింది. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్టలో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. కొండపైకి ఇతర వాహనాలను అనుమతించడం లేదు.

  • Loading...

More Telugu News