: సౌదీలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఐఎస్ఐఎస్
సౌదీ అరేబియాలోని దమ్మన్ లో ఉన్న షియా ముస్లింల మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతికి పాల్పడ్డ వ్యక్తి పేలుడు పదార్థాలు నింపిన కారులో వచ్చి, పార్కింగ్ స్థలంలో కారును ఉంచి, తనను తాను పేల్చివేసుకున్నాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవగా, పలువురు గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు తామే కారణమని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ అటాక్ తో షియా మసీదులపై ఐఎస్ఐఎస్ రెండోసారి దాడికి పాల్పడినట్టయింది.