: డ్వాక్రా రుణ మాఫీ ఎలా?: మరికాసేపట్లో బ్యాంకర్లతో చంద్రబాబు చర్చలు
ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా డ్వాక్రా సంఘాల్లోని మహిళల రుణమాఫీని ఎలా నెరవేర్చాలన్న విషయమై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ మధ్యాహ్నం పలు బ్యాంకుల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు గంటన్నర పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాబు బ్యాంకర్లను సంప్రదించనున్నారని తెలుస్తోంది. ఒక్కో డ్వాక్రా మహిళకు రూ. 10 వేలు రుణమాఫీ, ఆపై కొత్త రుణాలు, పంట రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకుల అభిప్రాయాలను ఆయన కోరనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశం తరువాత రాజమండ్రిలో సాయంత్రం జరగనున్న నంది నాటకోత్సవాల ముగింపు సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం చంద్రబాబు బయలుదేరుతారు.