: ఉద్యోగులు నిద్రపోయినా తప్పు లేదట!
బాగా కష్టపడి పనిచేసే ఉద్యోగులు కాస్తంత అలసి కార్యాలయంలోనే కునుకు తీస్తే మరేమీ ఫర్వాలేదులే అంటున్నారు జపాన్ కంపెనీల బాసులు. పైగా వారిని కొంచెం విశ్రాంతి తీసుకోనివ్వండని ప్రోత్సహిస్తున్నారు కూడా. పనిచేసే ప్రదేశంలో నిద్రపోవడం నేరమేమీ కాదని చెబుతున్నారు. అయితే, అక్కడా కొందరు నాటకాల రాయుళ్లు ఉన్నారట. తాము చాలా ఎక్కువగా పనిచేశామని భావిస్తూ, వీరు నిద్రపోతుంటారు మరి. మన దేశంలో అయితే, ప్రైవేటు ఆఫీసుల సంగతేమో కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కాళ్లు బార్లా చాపుకొని నిద్ర పోతుండడం, వీరిని పైఅధికారులు చీవాట్లు పెట్టడం చూస్తూనే ఉంటాం. ఏమైనా జపాన్ జపానే!