: ఇండియాను కాటేయనున్న కరవు: అమెరికన్ ఏజన్సీ హెచ్చరిక
ఈ సంవత్సరం ఇండియాను కరవు పీడించనుందని, పలు తుపానులు, ఎల్ నినోలు వ్యవసాయంపై ప్రభావం చూపనున్నాయని యూఎస్ కేంద్రంగా వాతావరణ వివరాల సేవలు తెలియజేసే ఆక్యూ వెదర్ వివరించింది. సముద్రాలపై వేడి ఒడిదుడుకుల కారణంగా సాధారణ స్థాయితో పోలిస్తే అధిక సంఖ్యలో తుపానులు రానున్నాయని అంచనా వేసింది. కాగా, ఇదే విధమైన హెచ్చరికలను ఐఎండీ (ఇండియా మెట్రొలాజికల్ డిపార్టుమెంట్) ఇప్పటికే జారీ చేసింది. అయితే, వీటిని కేవలం ముందు జాగ్రత్తగా చేసిన హెచ్చరికలుగానే పరిగణనలోకి తీసుకోవాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చింది. ఈ సీజనులో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.