: నేడు కేరళను తాకనున్న రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో 2 వేలకు చేరిన మృతులు


దేశవ్యాప్తంగా ఎండలు తగ్గుముఖం పట్టాయి. నైరుతీ రుతుపవనాలు నేడు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లక్షద్వీప్ మీదుగా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈ పవనాలు రానున్నాయని వివరించారు. గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కాగా, గడచిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. భయంకరమైన ఎండ వేడిమికి తాళలేక వడదెబ్బతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2005 మంది మరణించారని అధికారులు తెలిపారు. నిన్న జార్ఖండ్ లోని పలమావూ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న ఆంధ్రప్రదేశ్ లో 156 మంది తెలంగాణాలో 49 మంది చనిపోయినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News