: మరో మాజీ ప్రధానిని 'చాయ్'కి ఆహ్వానించిన మోదీ


తన ఇంటికి 'చాయ్'కి రావాలని జనతా దళ్ (ఎస్) అధినేత హెచ్.డీ. దేవెగౌడను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఈ విషయాన్ని స్వయంగా గౌడ వెల్లడించారు. "నా కార్యదర్శికి ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. విషయం ఏమంటే మోదీ నన్ను కలవాలని అనుకుంటున్నారట. టీ తాగేందుకు రమ్మని ఆహ్వానించారు" అని గౌడ మీడియాకు తెలిపారు. కాగా, ఈ వారం మొదట్లో మోదీ స్వయంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఆహ్వానించి గంటకు పైగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కాగా, తనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో వెంటనే వెళ్లేందుకు వీలు కుదరలేదని, జూన్ 3 లేదా 4న ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తానని అన్నారు. తమ కలయిక కేవలం మర్యాద పూర్వకమేనని, ఎటువంటి అజెండా లేదని ఆయన అనడం గమనార్హం. మోదీ అడిగితే, తాను ప్రధానిగా ఉన్న పది నెలల కాలంలో తన అనుభవాలను చెబుతానని అన్నారు.

  • Loading...

More Telugu News