: సీన్ రివర్స్... ఐఎస్ఐఎస్ ఉగ్రవాది తల తెగ్గోసిన క్రిస్టియన్ ఫైటర్


సీన్ రివర్సైంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు నిన్నటివరకూ తమకు దొరికిన సైనికులు, క్రిస్టియన్ల తలలను బహిరంగంగా తెగ్గోయడం, వాటిని వీడియోల్లో చిత్రీకరించి విడుదల చేయడం మనకు తెలిసిందే. అయితే, తాజాగా తమకు పట్టుబడ్డ ఓ ఉగ్రవాది తలను పదునైన ఆయుధంతో నిర్దయగా తెగ్గోశాడో క్రిస్టియన్ ఫైటర్. ఈ విషయాన్ని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. ఉత్తర సిరియాలోని హసకేహ్ ప్రావిన్స్ లో ఈ ఘటన జరిగిందని పేర్కొంది. తమకు పట్టుబడ్డ వ్యక్తి ఐఎస్ ఉగ్రవాదని నిర్ధారించుకున్న తరువాతనే కుర్దిష్ సైన్యంలో పనిచేస్తున్న ఓ క్రిస్టియన్ ఫైటర్ ప్రతీకారం తీర్చుకున్నాడని వివరించింది.

  • Loading...

More Telugu News