: యాదగిరి గుట్టలో యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు
ఈ ఉదయం యాదగిరి గుట్టలో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో గుట్ట మొత్తాన్నీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఏ ప్రైవేటు వాహనాన్నీ, బస్సులనూ గుట్ట పైకి అనుమతించలేదు. గుట్టపై ఉన్న హోటళ్లు, దుకాణాలను మూసివేయించారు. ఈ ఉదయం గుట్టకు వచ్చిన భక్తులకు కేవలం నడకదారి మాత్రమే మార్గమైంది. దీంతో భక్తులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సాధారణ రోజుల్లో 5 వేల మంది వరకూ, శని, ఆది వారాల్లో 20 నుంచి 25 వేల మంది వరకూ భక్తులు లక్ష్మీ నరసింహుని దర్శనార్థం వస్తుంటారు. కాగా, మరికాసేపట్లో కేసీఆర్ గుట్టకు చేరుకోనున్నారు.