: పోలీసునంటూ బెదిరించి మహిళను దోచుకున్న కాంగ్రెస్ మహిళా నేత... అరెస్ట్


తన భర్త గుండె జబ్బు చికిత్స నిమిత్తం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓ మహిళను నిర్దయగా దోచుకుందో కాంగ్రెస్ మహిళా నేత. పోలీసునంటూ బెదిరించింది. బట్టలూడదీయించి మరీ కొట్టింది. రూ. 70 వేలు దోచుకుంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బంగ్లాదేశ్ కు చెందిన రషీదా బేగం, తన భర్తతో కలసి నారాయణా హృదయాలయా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చారు. తన భర్తకు కావాల్సిన బట్టల కోసం సమీపంలోని ఓ మాల్ కు వెళ్లి వస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా పేరున్న కాంగ్రెస్ పార్టీ మహిళా నేత మంజుల, ఆమెను అడ్డగించి, బలవంతంగా స్టోర్ రూంకు లాక్కెళ్లింది. నిర్దయగా కొట్టింది. బట్టలూడదీయించింది. డబ్బులు లాక్కుంది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీలో నమోదయ్యాయి. పోలీసులు మంజులను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన సమయంలో కొంత ఘర్షణ జరుగగా, ఓ మహిళా కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. మంజులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News