: 'ఎర్ర' బ్యాచ్ ని కాపాడబోయిన డీఎస్పీ... నలుగురు కానిస్టేబుళ్లు సహా ఏడుగురి అరెస్ట్
ఎర్రచందనం కేసులో ప్రమేయమున్న ప్రముఖులు ఒక్కొక్కరుగా కటకటాల వెనక్కు వెళుతున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ డీఎస్పీ, నలుగురు కానిస్టేబుళ్లు సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసి ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల మధ్య జరిగిన గొడవల్లో వేలూరు జిల్లా అంబూరుకు చెందిన ఓ తమిళ పార్టీ కార్యకర్త, ఎర్రచందనం స్మగ్లర్ చిన్నపయ్యన్ హత్యకు గురికాగా, ఈ ఘటనలో నిందితులను కాపాడేందుకు రూ. 35 లక్షలను ముడుపుల రూపంలో డీఎస్పీ స్వీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ముఠా సభ్యులకు తెలియకుండా చిన్నపయ్యన్ ఎర్రచందనం దుంగలను విక్రయించడంతోనే హత్య జరిగినట్టు విచారణలో వెల్లడైంది. పోలీసులు అరెస్టు చేసిన నలుగురిలో ఓ మహిళ కూడా ఉంది.