: అప్పటికి ఆ శక్తి వస్తుంది... అదెలాగో మీరే చూస్తారు: కేసీఆర్
ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సీరియస్ గా దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతానికి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునే శక్తి ఉందన్న కేసీఆర్, ఎన్నికల నాటికి ఐదో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే శక్తి వస్తుందని, అదెలాగో మీరే చూస్తారని పార్టీ నేతలతో అన్నారు. ఎన్నికల వేళ క్రమశిక్షణ తప్పనిసరి అని, చిన్న తప్పు జరిగినా నష్టం తప్పదని హెచ్చరించారు. విజయంపై అనుమానాలు వద్దని నేతల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.