: ఇంటర్నెట్ లేకుండానే నావిగేషన్?


మనకు ఏమాత్రం పరిచయం లేని ప్రాంతాలు, పరిస్థితుల్లో మనల్ని తీవ్ర ఇబ్బందుల నుంచి బయటపడేసే ప్రయత్నం గూగుల్ చేస్తోంది. అడవుల్లో, ఎడారుల్లో, దారీతెన్ను తెలియని ప్రాంతాల నుంచి అవసరమైన చోటుకు సులభంగా చేరుకునే వెసులుబాటును గూగుల్ నావిగేషన్ కల్పించింది. అయితే ఈ సౌకర్యం ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న దేశాలకు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని భవిష్యత్ లో ఇంటర్నెట్ అవసరం లేకుండానే మొబైల్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్టు గూగుల్ ప్రకటించింది. త్వరలోనే ఆఫ్‌ లైన్‌ లో పని చేసే నావిగేషన్ యాప్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామని గూగుల్ చెప్పింది. గూగుల్ మాప్స్ యాప్ ద్వారా వాయిస్ బేస్డ్‌ గా ఈ నావిగేషన్ వ్యవస్థ పని చేస్తుందని గూగుల్ వెల్లడించింది. నెట్ సిగ్నల్స్ అందుబాటులో లేని, మెట్రో రైళ్లలో, విమానాల్లో ప్రయాణించేవారికి, భూగర్భ గనుల్లో, పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారికి ఈ యాప్ ఉపయోగకారిగా ఉంటుందని గూగుల్ పేర్కొంది. అయితే గూగుల్ ఆఫ్‌ లైన్ మ్యాప్స్‌ ను 2012 లో 150 దేశాల్లోని వినియోగదారులకు అందించింది. తరువాత అది ఇంటర్నెట్ వినియోగంతో అనుసంధానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News