: మోదీ గొప్ప ఆర్థిక వేత్త: స్మృతీ ఇరానీ


ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప ఆర్థిక వేత్త అని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద ప్రధాని మోదీ ఆర్థిక పాఠాలు నేర్చుకున్నారన్న రాహుల్ వ్యాఖ్యలపై అసోంలోని సిల్చార్ లో స్మృతీ ఇరానీ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థను బాగుచేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. గతి తప్పిన ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ గాటనపెట్టారని కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే రీతిలో నడిపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News