: ఒకే స్కూల్ లో 20 మంది కవలలు


ఎక్కడైనా కవలలు ఉంటే వారికి ఉండే ప్రత్యేకతే వేరు. వారేం చేస్తున్నారు? ఇద్దర్లో ఉండే పోలికలు ఏంటి? నడవడి ఎలా ఉంది? అంటూ పలు విషయాలు ఆసక్తికరంగా గమనిస్తాం. అదే 20 మంది కవలలు ఒకే చోట ఉంటే...అది కచ్చితంగా ప్రత్యేకతే. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని పిన్ కానింగ్ ఏరియాలో ఓ స్కూలు ఉంది. ఆ స్కూల్ లో 430 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వారిలో 20 మంది పిల్లలు కవలలు కావడం విశేషం. ఒకే తరగతిలో ఆరుగురు కవలపిల్లలు ఉన్నారని, అది కూడా తమ స్కూల్ ప్రత్యేకతల్లో ఒకటని స్కూల్ ప్రిన్సిపల్ ఆండీ చెప్పారు. ఇంత మంది కవలలను ఇదివరకెప్పుడూ ఎక్కడా చూళ్లేదని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News