: ఫేస్ బుక్ 'స్టేటస్' అతన్ని జైలుకి పంపింది!


మతాన్ని కించపరిచాడంటూ ఎన్నారైపై మరో ఎన్నారై ఫిర్యాదు చేసిన ఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చోటుచేసుకుంది. ఫేస్ బుక్ లో మత విద్వేషపూరిత స్టేటస్ పెట్టుకున్నందుకు భారతీయుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ దుబాయ్ న్యాయస్థానం తీర్పు చెప్పింది. గతేడాది జూలైలో ఓ న్యూస్ బులెటిన్ చూసిన భారతీయ వ్యక్తి, తన ఫేస్ బుక్ స్టేటస్ మార్చాడు. ఈ విషయం మరో భారతీయుడికి వాట్స్ యాప్ లో మెసేజ్ గా వచ్చింది. దీంతో ఇస్లాం మతాన్ని, మహమ్మద్ ప్రవక్తను కించపరిచాడని పేర్కొంటూ అతను మరో ఎన్నారైపై ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం ఇస్లాం మతాన్ని, మహమ్మద్ ప్రవక్తను అతను కించపరిచాడని నిర్ధారించింది. దీంతో అతనికి ఏడాది జైలు శిక్ష విధించి, శిక్ష ముగిసిన వెంటనే అతనిని స్వదేశం పంపేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై 15 రోజుల్లోగా అప్పీలు చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది.

  • Loading...

More Telugu News