: పెళ్లాం మీద కోపంతో బస్సు హైజాక్ చేశాడు!


ఫిలిప్పీన్స్ లో రెనే ప్రజేలే అనే సైనికుడు భార్యతో గొడవపడ్డాడు. అయితే, భార్యను ఏమీ చేయలేక ఆ ఉక్రోషాన్ని ఎలా ప్రదర్శించాడో చూడండి! అమాయకులపై తన ప్రతాపం చూపాలని నిర్ణయించుకున్నాడు. రహదారిపై వెళుతున్న బస్సులో ఎక్కి, తుపాకీతో అందరినీ భయపెట్టాడు. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు అతడి తీరును చూసి హడలిపోయారు. చేతిలో తుపాకీ ఉండడంతో చంపేస్తాడేమోనని భయపడ్డారు. దాదాపు నాలుగు గంటలపాటు ప్రయాణికులను తన నిర్బంధంలో ఉంచుకుని నానా హంగామా చేశాడు. దీంతో, ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. చివరికి ఆ సైనికుడు పోలీసులకు లొంగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News