: ఇకపై ప్రేమ తాళాలు ఉండవు!
ప్రేమ తాళాలు ఇకపై మరుగునపడనున్నాయి. పారిస్ లోని సెయిన్ నదిపై ఉన్న పాంట్ డెన్ ఆర్ట్స్ బ్రిడ్జ్ కి ఓ ప్రత్యేకత ఉంది. ఏదైనా ప్రేమ జంట ఆ బ్రిడ్జికి తాళం కప్ప వేసి తాళం చెవులు నదిలో వదిలేస్తే ఆ బంధం కలకాలం నిలుస్తుందని వారి నమ్మం. ఈ నమ్మకం చాలా కాలంగా కొనసాగుతోంది. దీంతో ఆ బ్రిడ్జ్ కి లక్షలాది తాళాలు వేలాడుతున్నాయి. ప్రేమ సంగతేమో కానీ, తాళాల బరువుకు బ్రిడ్జి వంగిపోతోందని విమర్శకులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అక్కడి అధికారులు తాళాలు తొలగించనున్నారు. ఇకపై తాళాలు వేసేందుకు ప్రేమికులను అనుమతించమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రేమ బంధం బలపరిచే తాళాలు తెగిపోతున్నాయని ప్రేమికులు బాధపడుతున్నారు.