: అక్రమ ఆయుధాల కేసులో...విండీస్ క్రికెటర్ అరెస్టు
క్రికెట్ ప్రపంచానికి షాక్ తగిలింది. ఆటలో ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యక్రమాల్లో కటకటాల వెనక్కి చేరిన క్రికెటర్ల స్థాయిని పెంచుతూ విండీస్ క్రికెటర్ అక్రమ ఆయుధాల కేసులో అరెస్టయ్యాడు. వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్ (27) ను అక్రమ ఆయుధాల కేసులో డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విండ్ వార్డ్ ఐలాండ్ సభ్యుడుగా కొనసాగుతున్న ఆండ్రీ ఫ్లెచర్, 2008లో వెస్టిండీస్ జట్టులోకి వచ్చి, 15 వన్డేలు, 22 అంతర్జాతీయ ట్వంటీ 20 లు ఆడాడు. గత జనవరిలో దక్షిణాఫ్రికాతో డర్బన్ లో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్ లో అతను చివరిసారి ఆడాడు. అక్రమ ఆయుధాల కేసులో డొమానికాలోని డగ్లస్ చార్లెస్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని, న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.