: నా మ్యూజిక్ కాన్సర్ట్ 'రిస్ట్ బ్యాండ్స్' ముగ్గురి ప్రాణాలు కాపాడాయి: పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్


ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మ్యూజిక్ కాన్సర్ట్ ముగ్గురు యువతుల ప్రాణాలు కాపాడింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని బేటన్ రూజ్ లో టేలర్ స్విఫ్ట్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. ఈ కాన్సర్ట్ లో అభిమానులకు మెరిసే రిస్ట్ బ్యాండ్స్ అందజేశారు. ఈ రిస్ట్ బ్యాండ్స్ మ్యూజిక్ కి అనుగుణంగా అవి మెరుస్తాయి. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ముగ్గురు అమ్మాయిలు ప్రమాదానికి గురయ్యారు. ఒకమ్మాయి స్పృహ కోల్పోగా, మిగిలిన ఇద్దరూ కార్లో ఇరుక్కుపోయారు. ఎవరికైనా ఫోన్ చేసి సహాయం అడుగుదామంటే అవి పని చేయడం మానేశాయి. దీంతో యువతులు సహాయం కోసం రిస్ట్ బ్యాండ్ లు ఉపయోగించారు. డోర్ గ్లాస్ దగ్గర ఈ బ్యాండ్స్ పెట్టడంతో అటుగా వెళ్తున్న ఓ మహిళ వాటి మెరుపు చూసి అంబులెన్స్ కు ఫోన్ చేసింది. దీంతో అంబులెన్స్ వచ్చి వారిని క్షేమంగా ఆసుపత్రికి తరలించింది. ఈ విషయం తెలిసిన టేలర్ స్విఫ్ట్ తన మ్యూజిక్ కాన్సర్ట్ ముగ్గురు యువతులను కాపాడిందని ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News