: బొత్స ఇంటికి వెళ్లి చర్చలు జరుపుతున్న వైకాపా నేతలు
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారనే వదంతులు వెల్లువెత్తుతున్న వేళ, ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన ఇంటికి వైకాపా ఎంపీలు మిథున్ రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలతో పాటు పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, నాగేశ్వరరావు, జ్యోతుల నెహ్రూ వెళ్లారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన బొత్సను వీరంతా కలసి పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, తనకు విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగించాలనే కండిషన్ ను బొత్స పెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.