: బాయ్ ఫ్రెండ్ నటన చూసి దీపికా పదుకునే గర్వపడుతోందట


బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే ఒకరినొకరు పొగడ్తల్లో ముంచెత్తుకుంటున్నారు. 'పీకూ' ప్రివ్యూ చూసిన రణ్ వీర్ సింగ్ ఆ సినిమాలో దీపిక నటన అద్భుతమని ట్విట్టర్లో పొగిడిన సంగతి తెలిసిందే. తాజాగా రణ్ వీర్ సింగ్ నటించిన 'దిల్ ధడక్ నే దో' సినిమా ప్రివ్యూ చూసిన దీపికా పదుకునే ప్రియుడ్ని ఆకాశానికెత్తేసింది. రణ్ వీర్ సింగ్ నటనను చూసి గర్వపడుతున్నానని ట్వీట్ చేసింది. అనుష్కా శర్మతో బ్రేకప్ తరువాత ఒంటరైన రణ్ వీర్ సింగ్... రణబీర్ కపూర్ తో బ్రేకప్ అయిన దీపికా పదుకునేతో ప్రేమలో పడ్డాడు. 'రాం లీలా' సినిమాలోని పలు సన్నివేశాల్లో వారి మధ్య పండిన కెమిస్ట్రీని వీక్షించవచ్చు.

  • Loading...

More Telugu News