: రేవంత్ రెడ్డి ఇంట త్వరలో పెళ్లి బాజాలు!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి జీవం పోస్తున్న నేతల్లో రేవంత్ రెడ్డి ముఖ్యుడు. టీనేజ్ కుర్రాడిని తలపించే ఉత్సాహం, ప్రత్యర్థిని బోల్తా కొట్టించే వాక్చాతుర్యం ఆయన ప్రత్యేకతలు. ట్రెండీగా కనిపించే ఈ యువనేత ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లి ఎవరిదంటారా!... రేవంత్ రెడ్డికి పెళ్లీడుకు వచ్చిన కుమార్తె ఉంది. ఆమె పేరు నైమిష. ఇప్పుడామె వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుడు ఆంధ్రాకు చెందిన వ్యక్తి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ సంపన్న కుటుంబంతో రేవంత్ వియ్యమందుకుంటున్నారు. త్వరలోనే వివాహం కావడంతో, పెళ్లి పనులు మొదలయ్యాయట. రెండు కుటుంబాల వారు సన్నాహాలతో బిజీగా ఉన్నారట. మరికొన్ని రోజుల్లో రేవంత్ దీనిపై మీడియాలో వివరాలు తెలిపే అవకాశం ఉంది.