: లాభాలలో స్టాక్ మార్కెట్లు


ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తదితర బ్లూ చిప్ కంపెనీల షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 322 పాయింట్లు ఎగబాకి 27,828కి పెరిగింది. నిఫ్టీ 115 పాయింట్లు లాభపడి 8,434కు పెరిగింది. ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్, జేపీ ఇన్ ఫ్రా టెక్, అజంతా ఫార్మా, భారతీ ఇన్ ఫ్రా టెల్, ఫోర్టిస్ హెల్త్ కేర్ లు టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టాప్ లూజర్స్ జాబితాలో పీఎంసీ ఫిన్ కార్ప్, డెన్ నెట్ వర్క్స్ లిమిటెడ్, పిరమల్ ఎంటర్ ప్రైజెస్, సుప్రీం ఇండస్ట్రీస్, ప్రిస్టేజ్ ఎస్టేట్స్ కంపెనీలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News