: పెళ్లి కోసం అప్పు...అదే పెళ్లి లో ఆత్మహత్య!
కుమార్తె పెళ్లి కోసం అప్పు చేసిన ఓ వ్యక్తి, అదే పెళ్లిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు దగ్గర్లోని కకోరీ గ్రామానికి చెందిన మున్షీలాల్ అనే రైతు కుమార్తెకు వివాహం చేసేందుకు బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి నుంచి అప్పు తీసుకున్నాడు. అనంతరం స్థాయికి తగ్గట్టు కుమార్తెకు వివాహం చేశాడు. అనంతరం వివాహ వేదికకు 500 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా అతనిది ఆత్మహత్యగా వైద్యులు నిర్ధారించారు.