: హైదరాబాద్ యువతపై కన్నేసిన ఐఎస్ఐఎస్


పలు అరాచకాలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ హైదరాబాద్ యువతపై కన్నేసింది. భారీ వేతనాలు, విలాసవంతమైన జీవితం ఉంటుందని ఆశ చూపి... తమలో కలుపుకునేందుకు యత్నిస్తోంది. తమ వలలో పడిన వారిని దుబాయ్ కు తరలించి అక్కడనుంచి సిరియాకు పంపిస్తుంది. ఈ క్రమంలో ఆసక్తి కలిగిన యువకులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా పాస్ పోర్ట్ ఇప్పించి... అందరినీ దుబాయ్ కు తీసుకెళతారు. అక్కడ మూడు నెలల పాటు యువకులకు ట్రైనింగ్ ఇస్తారు. అనంతరం వారి కుటుంబీకులను వెనక్కి పంపి, ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వ్యక్తిని మాత్రం తమతోపాటు తీసుకెళ్తారు. ఈ క్రమంలో ఐఎస్ఐఎస్ వలలో చిక్కిన నలుగురు యువకులను హైదరాబాద్ పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా ఐఎస్ లో కలవడానికి వెళ్లడానికి యత్నించిన 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే, వీరిలో కొందరు అడ్రస్ లేకపోవడంతో పోలీసులు వారికోసం వెతుకుతున్నారు. ఈ అంశం ఇంటెలిజెన్స్ విభాగాన్ని కలవరపెడుతోంది.

  • Loading...

More Telugu News