: ఏ సెంటర్ కు వచ్చినా నేను రెడీ: ఆనంకు సి.కల్యాణ్ సవాల్


నెల్లూరు వక్ఫ్ బోర్డు భూముల వివాదంలో చిక్కుకున్న నిర్మాత సి. కల్యాణ్ కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డిపై విరుచుకుపడ్డారు. భూ ఆక్రమణకు, భూమి కొనుగోలుకు తేడా తెలియని ఆనం మతిలేని మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. నెల్లూరును దోచుకుంటున్నది ఆనం వివేకానే అని, ఈ విషయంలో ఏ సెంటర్ కు వచ్చినా తాను చర్చకు సిద్ధమని కల్యాణ్ సవాల్ విసిరారు. ఆనం అక్రమాలపై సినిమా తీస్తానని అన్నారు. 'సి. కల్యాణ్' అంటే అల్లాటప్పా వ్యక్తి కాదని, తాకితే కరెంట్ షాక్ తప్పదని హెచ్చరించారు. అంతకుముందు, నెల్లూరు జిల్లా ముస్లిం సంఘాలు సి.కల్యాణ్ వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించారంటూ ఆరోపణలు చేశాయి. దీనిపై మండిపడ్డ నిర్మాత, ముస్లిం సంఘాల వెనుక ఆనం ఉన్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News