: ఆఫీసుల్లో పోర్న్ సైట్లు చూడడంలో చైనీయులే టాప్!
అన్ని రంగాల్లోనూ దూసుకెళుతున్న చైనీయులు మరో విషయంలోనూ అగ్రస్థానంలో నిలిచారు. ఆఫీసులో పనిచేసే సమయంలో పోర్న్ (అశ్లీల) సైట్లు చూడడంలో చైనా వారిదే అగ్రస్థానం అని ఓ సర్వే చెబుతోంది. బ్లూ కోట్ సిస్టమ్స్ అనే సంస్థ దీనిపై సర్వే నిర్వహించింది. అందులో భాగంగా 11 దేశాల్లో 1580 మందిని పరిశీలించి నివేదిక రూపొందించారు. అందులో, 19 శాతంతో చైనా టాప్ లో నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో మెక్సికో (10 శాతం), బ్రిటన్ (9 శాతం) ఉద్యోగులు నిలిచారు. ఆఫీసు కంప్యూటర్లలో అలాంటి అశ్లీల వెబ్ సైట్లు చూడడం ప్రమాదకరమని తెలిసినా, వారు వెనుకాడడం లేదని సర్వేలో వెల్లడైంది. సైబర్ సెక్యూరిటీ సమస్యలు వస్తాయని వారిలో అత్యధికులకు తెలుసని బ్లూ కోట్ సిస్టమ్స్ సీటీఓ హ్యూ థాంప్సన్ పేర్కొన్నారు. మాల్వేర్లు, వైరస్ లను పోర్న్ వెబ్ సైట్ల మాటున సులువుగా ఇంటర్నెట్ లో చొప్పించడమనేది ఇప్పుడు బాగా వాడుకలో ఉన్న విధానం.