: శేషాచలం ఎన్ కౌంటర్ పై సీబీఐ విచారణ జరిపించండి... ఎన్ హెచ్ఆర్సీ సూచన

ఏపీలోని చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై సీబీఐ చేత విచారణ జరిపించాలని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్సీ) సూచించింది. ఈ ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సిఫారసు చేసింది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని ఈ నెల 12న జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం పరిశీలించింది. ఎన్ హెచ్ఆర్సీ సభ్యుడు దత్తు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాలు సచ్చినోడిబండ, చీగటిగలకోన ప్రాంతాలకు వెళ్లింది. ఘటనకు సంబంధించి వివిధ శాఖలనుంచి నివేదికలు తెప్పించుకుని, స్థానిక పరిస్థితులను అంచనావేసి తాజాగా నివేదికను వెల్లడించింది.