: నారా లోకేశ్ ను 'ట్విట్టర్ పిట్ట' అని పేర్కొన్న తలసాని


తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. లోకేశ్ ను 'ట్విట్టర్ పిట్ట' అని పేర్కొంటూ పలు విమర్శలు చేశారు. ట్విట్టర్ పిట్ట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని అన్నారు. స్థాయికి మించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అటు, లోకేశ్ తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపైనా ఆయన విరుచుకుపడ్డారు. హెరిటేజ్ సాయంతో బాగానే వెనకేసుకున్నారని ఆరోపించారు. హైదరాబాదును అందరు ముఖ్యమంత్రులూ అభివృద్ధి చేశారని స్పష్టం చేశారు. హైదరాబాదులో హైటెక్ సిటీని తప్ప చంద్రబాబు దేన్నీ అభివృద్ధి చేయలేదని వ్యాఖ్యానించారు. ఇక, టీడీపీ మహానాడుకు మీడియా అధిక ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు.

  • Loading...

More Telugu News