: ఎర్రబెల్లి టీఆర్ఎస్ లోకి రాకుండా అడ్డుకున్నది నేనే!: మంత్రి కడియం


టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ కొన్ని నెలల కిందట వార్తలు షికారు చేశాయి. ఆ తరువాత అవన్నీ సద్దుమణిగాయి. ఆయన మాత్రం టీడీపీలోనే ఉన్నారు. అయితే అసలు ఎర్రబెల్లి టీఆర్ఎస్ లోకి రావాలనుకున్నారా? లేదా? తాజాగా దానిపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొత్త విషయం చెప్పారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్ లోకి రావాలనుకున్న మాట వాస్తవమేనని, కానీ ఆయన టీఆర్ఎస్ లోకి రాకుండా అడ్డుకున్నది తానేనని కడియం వెల్లడించారు. తెలంగాణ ద్రోహులకు టీఆర్ఎస్ లో ఎప్పటికీ స్థానం ఉండదని, పార్టీని విమర్శించే అర్హత కూడా ఎర్రబెల్లికి లేదని అన్నారు.

  • Loading...

More Telugu News