: మాధురీ దీక్షిత్ కు ఎఫ్ డీఏ నోటీసు... మ్యాగీ ప్రకటనలో నటించిన ఫలితం
బాటీవుడ్ నటి మాధురీ దీక్షిత్ కు హరిద్వార్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) నోటీసు జారీ చేసింది. 'టు మినిట్స్ నూడుల్స్' పేరుతో వచ్చిన మ్యాగీ వాణిజ్య ప్రకటనలో నటించినందుకు గానూ ఆమెకు ఈ నోటీసు ఇచ్చినట్టు తెలిసింది. 'టు మినిట్స్ నూడుల్స్'లో పోషక విలువలు ఉన్నాయంటూ మ్యాగీ ప్రకటనలో మాధురీ చెప్పిన మాటలకు గానూ 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరినట్టు హరిద్వార్ ఎఫ్ డీఏ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు జరిపించిన పరీక్షల్లో మ్యాగీ నూడుల్స్ లో హానికరమైన రసాయనాలు ఉన్నట్టు తేలింది. దాంతో యూపీలో మ్యాగీ అమ్మకాలు నిలిచిపోయాయి. అంతేగాక మ్యాగీపై దేశవ్యాప్త నిషేధం కూడా విధించనున్నారని తెలుస్తోంది.