: టీ.కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన శారద
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కరీంనగర్ జిల్లాకు చెందిన నేరెళ్ల శారద బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, వయలార్ రవి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి తదితరుల సమక్షంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అజాద్ మాట్లాడుతూ, దేశంలో కాంగ్రెస్ పార్టీలోనే మహిళలకు సమున్నత గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. కౌన్సిల్ లో మహిళలకు ఏ ఒక్కపార్టీ కూడా సీటు ఇవ్వలేదని, ఒక్క కాంగ్రెస్ పార్టీనే ఆకుల లలితకు అవకాశం ఇచ్చిందని ఎద్దేవా చేశారు.